Tuesday, April 28, 2020

Telugu Poem on Coronavirus

కరోన ఓ కరోనా

నీవొక శాపమా?
కనువిప్పు కలిగించే వరమా?

మా ఆరాటాలకు
మా పోరాటాలకు
గుణపాఠమా?

నీకు మాపై ఏ బేదబావంలేదు
అందరిని ఒకేలా చూస్తున్నావు

కాని కరుణ లేకుండా
కాటు మాత్రం వేస్తున్నావు

నీవు మా పాలిట శాపమా? వరమా?

పంచభూతముల పరమార్దం మరిచిన మాకు
ఎంతకు లొంగని బూతంలా మారావు

అభివృద్ధి పేరుతో విర్రవీగిన మాకు
మా వృద్ధి ఏ పాటిదో
చూపిస్తివి

మిత పరిమితాలు మరిచిన మాకు

సమానత్వం అంటే ఏమిటో చూపిస్తివి

రాజ్యలేలే రాజైన
 రాళ్ళు కొట్టె కూలైన
తప్పించుకొలేరు
నీ కబంద హస్తాల నుండి

వైద్యులంటే సాక్షాత్తు నారాయణులేనని

ఖాకీలలో కేవలం కాఠిన్యం మాత్రమే కాదు కారుణ్యం
కూడ కలదని
తెలిసేలా చేసావు

నీవు మాత్రం కంటికి కనిపించవు
అందరిని కట్టడి మాత్రం చేస్తున్నావు

అన్నదాతల విలువను
అందరికి అర్దం అయ్యేలా చేసావు

పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగేలా చేసావు

ఈ శతాబ్దపు జనాలకు
నీ పవరేంటో చూపిస్తివి

ఇకనైన కరునించు

మా తప్పులు తెలుసుకున్నాం
ప్రాయశ్చిత్తం చేసుకుంటాం
ప్రతి ప్రాణికి విలువనిస్తాం
వివేకంతో నడుచుకుంటాం
ఇది మా భీష్మ ప్రతిజ్ఞ.

కరోనా నీవొక శాపమా వరమా.   
Written by Macharla Harinath

2 comments: